Tuesday, 22 October 2013

రాష్ట్రంలో చదువులపై విదేశీయుల మోజు


Education Newsదేశంలోనే మనది రెండోస్థానం ఓయూలో అత్యధికులు తొలిస్థానంలో కర్ణాటక
సాక్షి, హైదరాబాద్: విదేశీ విద్యార్థుల ఆకర్షణలో మన రాష్ట్రం దేశంలో రెండోస్థానంలో ఉంది. పూర్వం తక్షశిల విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు సుదూర దేశాల నుంచి విద్యార్థులు తరలివచ్చేవారని చరిత్ర చెబుతోంది. తర్వాత పరిస్థితి మారి మన దేశ విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించడంపై మోజు పెంచుకున్నా.. మన దేశంలో చదువుకునేందుకు కూడా ఇతర దేశాల నుంచి విద్యార్థులు రావడం గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఏటా వీరి సంఖ్య పెరుగుతుండడం శుభపరిణామం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఓ తాజా సర్వే ప్రకారం 2010-11లో మన దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విదేశీ విద్యార్థుల సంఖ్య 27,531. ప్రపంచవ్యాప్తంగా 153 దేశాల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. ఇందులో 4 శాతం మన విద్యార్థులు మోజుపడే అమెరికాకు చెందినవారు కావడం మరో విశేషం. కాగా నేపాల్ నుంచి 18%, ఇరాన్ 9%, అఫ్ఘానిస్థాన్ 8%, భూటాన్ నుంచి 5%, సూడాన్ నుంచి 4% మంది విద్యార్థులు ఉన్నారు. 
రాష్ట్రంలో చదువులపై విదేశీయుల మోజు

No comments:

Post a Comment

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner