Tuesday, 22 October 2013

లాసెట్-2013 కౌన్సెలింగ్ ప్రారంభం


Education Newsతొలిరోజు 1485 మంది హాజరు
తిరుపతి, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో 3 ఏళ్ల న్యాయ శాస్త్ర అధ్యయన ప్రవేశానికి లాసెట్-2013 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం మొదలైంది. హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల్లో అభ్యర్థుల విద్యార్హత పత్రాలను సంబంధిత అధికారులు పరిశీలించారు. తొలి 5000 ర్యాంకు వరకు మొత్తం 1485 మంది విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌కు హాజరైనట్టు లా సెట్ కన్వీనర్ కృష్ణయ్య తెలిపారు. మంగళవారం నిర్వహించే కౌన్సెలింగ్‌లో 5001 ర్యాంకు నుంచి తుది ర్యాంకు వరకు పరిశీలన జరగనుందని వివరించారు.
లాసెట్-2013 కౌన్సెలింగ్ ప్రారంభం

No comments:

Post a Comment

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner