అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS)లో మెడిసిన్ చదవటం అనేది లక్షల మంది విద్యార్థుల కలల్లో ఒకటి. దాన్ని నిజం చేసుకోవాలంటే ఎయిమ్స్ 2014 ప్రవేశపరీక్షలో అర్హత సాధించాలి. అలాంటి ఎయిమ్స్ ప్రవేశపరీక్ష చరిత్రలో మొదటి సారిగా ఒక తెలుగమ్మాయి జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. విశాఖపట్నంకు చెందిన విద్యార్థిని పట్టిసపు శ్రీవిద్య తన పేరుని సార్ధకంచేసుకుంది.మీరు ఇష్టంతో చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారని పెద్దలు చెబుతుంటారు. అది శ్రీవిద్య విషయంలో మరోసారి రుజువయింది. తన తల్లిదండ్రుల ప్రేరణ, అధ్యాపకుల పోత్సాహం వల్ల చదువుని ఇష్టంగా మార్చుకున్నానని చెబుతోంది. సినిమాలు, ఇతర వ్యాపకాలతో కొంత సమయాన్ని సరదాగా గడుపుతూనే అన్ని పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించానని అంటోంది.
No comments:
Post a Comment