ఫిబ్రవరి 17న లోక్‌సభలో ప్రవేశపెట్టిన చిదంబరం2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ఫిబ్రవరి 17న (సోమవారం) పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వార్షిక వ్యయం రూ.17,63,214 కోట్ల అంచనాతో ప్రవేశపెట్టిన ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఇటు మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేందుకు.. అటు తయారీ రంగానికీ కొంత ఊతమిచ్చేందుకు ప్రయత్నించారు విత్త మంత్రి. అంతా ఊహించినట్లే విధానపరంగా కీలకమైన నిర్ణయాలేమీ లేవు. అయితే.. పదేళ్ల యూపీఏ పాలనలో చివరి బడ్జెట్ కావటంతో.. యూపీఏ పాలన విజయాల చిట్టా చదివారు. ఈ తరుణంలో బడ్జెట్ సమగ్ర స్వరూపం మీకోసం..
2014-15 మధ్యంతర బడ్జెట్ హైలైట్స్
- మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 17,63,214 కోట్లు
- ప్రణాళికా వ్యయం రూ. 5,55,322 కోట్లు
- ప్రణాళికేతర వ్యయం రూ. 12,07,892కోట్లు. ఇందులో ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీ భారం రూ. 2,46,397కోట్లు.
- రక్షణ బడ్జెట్ రూ. 2.24 లక్షల కోట్లు(10% పెంపు).
http://www.sakshieducation.com/GroupII/GIIPDFStory.aspx?nid=67288
No comments:
Post a Comment