Wednesday, 23 October 2013

ప్రతిభకు గుర్తింపే ఈ స్కాలర్‌షిప్


harshita reddyఆదిత్య బిర్లా గ్రూప్..1999లో ఆదిత్య బిర్లా గ్రూప్ స్కాలర్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. అప్పటినుంచి ప్రతిఏటా నిర్ణీత కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ఈ క్రమంలో 2013 సంవత్సరానికి నల్సార్- హైదరాబాద్‌కు చెందిన కాసర్ల హర్షితా రెడ్డి ‘న్యాయ శాస్త్ర’ విభాగంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైంది. తన ప్రతిభకు గుర్తింపుగా ఈ స్కాలర్‌షిప్ అందిందని భావిస్తున్నానంటున్న హర్షిత సక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే...
ఆదిత్య బిర్లా స్కాలర్‌షిప్‌నకు ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. స్కాలర్‌షిప్ ద్వారా ట్యూషన్ ఫీజు మేరకు.. ఏటా రూ.1.8 లక్షల చొప్పున మొత్తం ఐదేళ్లపాటు అందుతుంది.

విద్యా నేపథ్యం:
మా స్వస్థలం కరీంనగర్ జిల్లా, కోనరావుపేట మండలం కనకర్తి. నాన్న సత్యనారాయణరెడ్డి వ్యాపారం దృష్ట్యా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం. ఒకటి నుంచి పదో తరగతి వరకు భావన్స్‌లో, పదో తరగతి తర్వాత ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్మీడియెట్‌కు తత్సమానమైన ఐబీ కోర్సును 2012లో పూర్తి చేశాను. ఓక్రిడ్జ్‌లోనూ 2.75 లక్షల స్కాలర్‌షిప్ లభించింది.

Aditya Birla Group Scholarship, Recognition for merit, Kasrala Harshita Reddy

No comments:

Post a Comment

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner