Latest Current Affairs

Latest Job Alerts

Career Guidance

Wednesday, 2 October 2013

దృగ్గోచర వర్ణపటం


Tenth class తెల్లని సూర్యకిరణాలు ఒక గాజు పట్టకంపై పతనం చెందినపుడు అవి కాంతి విశ్లేషణం వలన ఊదా (Violet-V), నీలి (Indigo-I), నీలం (Blue-B), ఆకుపచ్చ (Green-G), పసుపుపచ్చ (Yellow-Y), నారింజ (Orange-O),ఎరుపు (Red-R ) రంగులుగా ఒక వర్ణపటాన్ని ఏర్పరుస్తాయి. ఈ వర్ణపటాన్ని మనం కంటితో చూడగలం కాబట్టి దీనిని ‘దృగ్గోచర వర్ణపటం’ అని అంటారు.
-తరంగ ధైర్ఘ్యాల లేక పౌనఃపున్యాల సముదాయాన్ని ‘వర్ణపటం’ అంటారు. (కాంతిని తరంగరూపంలో తీసుకుంటాం కాబట్టి). మనకు తెలిసిన కాంతి జనకాలన్నీ వర్ణపటాలను ఏర్పరుస్తాయి.
పరమాణువులలోని ఉత్తేజ వేలన్‌‌స ఎలక్ట్రాన్‌లు, తిరిగి వాటి తొలిస్థానాలకు దూకడం వలన దృగ్గోచర వర్ణపటం ఉద్గారమవుతుంది. ఒక పదార్థం నుంచి ఉద్గారమయ్యే కాంతి రంగు ఆ పదార్థంలోని పరమాణువుల లక్షణాలను బట్టి ఉంటుంది. దీపావళి టపాసులను కాల్చినపుడు వెలువడే రంగుల మాదిరిగా. సూర్యుడు, దూరంగా ఉండే నక్షత్రాల నుంచి వచ్చే కాంతి ఉద్గారం నుంచి వాటిలో ఉండే పదార్థాల వివరాలను తెలుసుకోవచ్చు.

దృగ్గోచర వర్ణపటం

No comments:

Post a Comment

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner