ఒక దారానికి చివరలో రాయికట్టి దానిని క్షితిజ సమాంతరంగా ఉండే వృత్తమార్గంలో తిప్పినప్పుడు ఆ చర్యలో పని చేసేభౌతిక శాస్త్ర భావన ఏమిటి?న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం గమనంలో ఉన్న ఏ వస్తువైనా సమవేగంతో, సరళమార్గంలో పయనించాల్సి ఉంటుంది కానీ, ఇక్కడ రాయి వక్రమార్గం అంటే వృత్తాకార మార్గంలో పయనిస్తుంది. అంటే, ఆ రాయిని సరళ మార్గం పక్కకు తప్పించేందుకు రాయిపై ఒక ‘బలం’ పనిచేస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ బలం వృత్తాకార మార్గపు వ్యాసార్థం మీదుగా వృత్త కేంద్రం వైపు పని చేస్తుంది. వృత్త కేంద్రం వైపు పనిచేసే ఈ బలాన్ని ‘అభికేంద్రబలం’ అంటారు. దారాలు కట్టిన రాయిని క్షితిజ సమాంతరంగా ఉండే వృత్తాకార మార్గంలో తిప్పడానికి కావాల్సిన అభికేంద్రక బలాన్ని దారం పట్టుకున్న చేయి సమకూరుస్తుంది.