కంప్యూటరీకరణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలతో ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారింది. ఇదే ఒరవడితో విద్యారంగంలోనూ ఆధునికత సంతరించుకుంటోంది. ఈ క్రమంలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చి.. దినదినప్రవర్థమానం అవుతోంది మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్ (మూక్స్-MOOCs). ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఇంటి నుంచే అంతర్జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లలో కోర్సులు అభ్యసించొచ్చు. తక్కువ ఖర్చుతో ఉన్నత ప్రమాణాలతో కూడిన కోర్సులు పూర్తిచేసుకోవడమే కాకుండా.. ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండే సర్టిఫికెట్లు పొందేందుకు సరికొత్త మార్గంగా నిలుస్తున్న మూక్స్‌పై ఫోకస్.. |