![]() న్యూఢిల్లీ: కంపెనీల సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కారణంగా 50 వేల మరిన్ని ఉద్యోగావకాశాలు ఉత్పన్నమవుతాయని నిపుణులంటున్నారు. సీఎస్‌ఆర్‌ను తప్పనిసరి చేయడం వల్ల ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని, రానున్న సంవత్సరాల్లో ఈ ఉద్యోగాల సంఖ్య 50 శాతానికి పైగా పెరుగుతుందని వారంటున్నారు. కంపెనీల చట్టం పరిధిలోకి సుమారుగా 8,000 కంపెనీలు వస్తాయని, ఫలితంగా కొత్త ఉద్యోగావకాశాలు ఉత్పన్నమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సీఎస్‌ఆర్ కార్యకలాపాలను కంపెనీ కమ్యూనికేషన్స్ విభాగం చూస్తోం దని, కొత్త కంపెనీల చట్టం కారణంగా సీఎస్‌ఆర్ కోసం కనీసం ఐదారుగురితో ఒక జట్టు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని నిపుణులంటున్నారు. సీఎస్‌ఆర్ నిపుణుల కోసం డిమాండ్ 50-60% పెరిగే అవకాశాలున్నాయని ప్రముఖ హెచ్‌ఆర్ సంస్థ గ్లోబల్‌హంట్ ఎండీ సునీల్ గోయల్ చెప్పారు. |
Latest Current Affairs
Latest Job Alerts
Career Guidance
Tuesday, 15 October 2013
కంపెనీల సామాజిక బాధ్యత... 50 వేల కొత్త కొలువులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment