హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యా సంస్థల్లో అడ్మిషన్ల వ్యవహారం మళ్లీ వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీ విషయంలో గందరగోళం తలెత్తగా.. తాజాగా మరో విషయం తెలుగు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) నిబంధనల ప్రకారం అడ్వాన్స్‌డ్‌లో సాధించిన మార్కులతో పాటు ఆయా రాష్ట్రాల బోర్డులు నిర్వహించిన ఇంటర్మీడియట్ మార్కుల ప్రకారం టాప్-20 పర్సంటైల్‌లో ఉంటేనే ఐఐటీలో సీటు పొందేందుకు అర్హులవుతారు. ఒకవేళ టాప్ 20 పర్సంటైల్ జాబితాలో లేకపోతే సదరు విద్యార్థికి ఐఐటీ అడ్మిషన్ దక్కదన్నమాట! ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సీబీఎస్‌ఈ అధికారులు వివిధ రాష్ట్రాల టాప్-20 పర్సంటైల్‌కు సంబంధించిన కటాఫ్ మార్కులను ప్రకటించారు. దీని ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 1000 మార్కులకు గాను జనరల్ అభ్యర్థికి కనీసం 920 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఒక్క ద్వితీయ సంవత్సరం మార్కులనే పరిగణనలోకి తీసుకుంటే 530 మార్కులకు గాను 492 కంటే ఎక్కువ మార్కులు రావాలి. అలాంటి విద్యార్థులే ఐఐటీలో చేరేందుకు అర్హులు. ఇంటర్‌లో ఈ మేరకు టాప్-20 పర్సంటైల్ కటాఫ్ మార్కులు(92 శాతం) సాధించకుంటే.. ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించినా ప్రయోజనం ఉండదు. అయితే ఇతర