మరికొద్ది రోజుల్లో జేఈఈ మెయిన్ ర్యాంకులు వెల్లడి కానున్నాయి. జూలై 1 నుంచి జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 30 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు; కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లు; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (ఐఐఐటీఎం); ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)లు, ఇతర సంస్థల్లో వివిధ కోర్సుల్లో దాదాపు 40,000 సీట్లున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్ఐటీల్లో .. బీటెక్‌లో టాప్ బ్రాంచ్‌ల్లో గతేడాది క్లోజింగ్ ర్యాంకుల వివరాలు తెలుసుకుందాం.. |
Latest Current Affairs
Latest Job Alerts
Career Guidance
Tuesday, 24 June 2014
ప్రముఖ ఎన్ఐటీలు.. కటాఫ్ ర్యాంకులు
జూలై 7 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను జూలై 7వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఫీజు రీయెంబర్స్‌మెంట్‌కు సంబంధించిన స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు పాత ప్రవేశాల విధానం అమల్లో ఉంటున్నందున రెండు రాష్ట్రాల్లో ఫీజు రీయెంబర్స్‌మెంట్, కొత్త కాలేజీల అనుమతుల వ్యవహారం ఆలోగానే తేల్సాల్సి ఉంది. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి కొత్త కాలేజీలకు ఇచ్చే అనుమతుల వివరాలు త్వరలోనే రానున్నాయి. ఈనెల 29 నుంచి కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని గతంలోనే నిర్ణయించినా కొత్త కాలేజీల అనుమతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు జారీ కావాల్సి ఉన్నందున కౌన్సెలింగ్‌ను వాయిదా వేసింది. |
జూలై 7 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్
తెలంగాణా పభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ సెక్షన్లు!
హైదరాబాద్: ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం మూడేళ్ల పిల్లలను చేర్చుకోవడం లేదు. ఐదేళ్లు నిండితేనే చేర్చుకుంటున్నాం. దీంతో తల్లిదండ్రులు పిల్లలను బలవంతంగా ప్రైవేటు స్కూళ్లలో చేరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రీ ప్రైమరీ సెక్షన్లు ఉంటే వారంతా ఇక్కడే చేరుస్తారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించేందుకు ఆలోచనలు చేస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య పథకంలో భాగంగా దీనిని పక్కగా అమలు చేస్తాం..’’అని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకువచ్చి ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించడం ద్వారా ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే వారి సంఖ్యను తగ్గించవచ్చని మంత్రి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి జగదీష్‌రెడ్డిని మీడియా ప్రతినిధులు కలిసిన సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. విలేకరులు అడిగిన వివిధ అంశాలపై మంత్రి పేర్కొన్న వివరాలు... |
Wednesday, 18 June 2014
Saturday, 14 June 2014
Subscribe to:
Comments (Atom)


