హైదరాబాద్: ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం మూడేళ్ల పిల్లలను చేర్చుకోవడం లేదు. ఐదేళ్లు నిండితేనే చేర్చుకుంటున్నాం. దీంతో తల్లిదండ్రులు పిల్లలను బలవంతంగా ప్రైవేటు స్కూళ్లలో చేరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రీ ప్రైమరీ సెక్షన్లు ఉంటే వారంతా ఇక్కడే చేరుస్తారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించేందుకు ఆలోచనలు చేస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య పథకంలో భాగంగా దీనిని పక్కగా అమలు చేస్తాం..’’అని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకువచ్చి ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించడం ద్వారా ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే వారి సంఖ్యను తగ్గించవచ్చని మంత్రి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి జగదీష్‌రెడ్డిని మీడియా ప్రతినిధులు కలిసిన సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. విలేకరులు అడిగిన వివిధ అంశాలపై మంత్రి పేర్కొన్న వివరాలు... |
Latest Current Affairs
Latest Job Alerts
Career Guidance
Tuesday, 24 June 2014
తెలంగాణా పభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ సెక్షన్లు!
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment