ఓ వైపు బంగారు భవిష్యత్తును చూపించే కోర్సులు.. మరో వైపు కళ్లు చెదిరే ఫీజులు.. కోర్సులో చేరాలనే బలమైన ఆకాంక్ష.. అనుకూలించని ఆర్థిక పరిస్థితులు.. చివరకు రాజీ ధోరణితో ఏదో ఒక కోర్సులో చేరడం..ప్రతిభ, నైపుణ్యాలు మెండుగా ఉన్నప్పటికీ ప్రస్తుత విద్యా ప్రపంచంలో అధిక శాతం మందికి ఎదురవుతున్న అనుభవం. అయితే.. విద్యార్థులు ఈ పరిస్థితిని అధిగమించొచ్చు. ప్రతిభ ఉంటే రాజీ పడాల్సిన అవసరమే లేదు. కారణం.. బ్యాంకులు విద్యా రుణాల పేరుతో అందిస్తున్న భరోసానే. రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూట్లలో.. విదేశాల్లోనూ చదవాలనుకునే ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్ని జాతీయ బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నాయి. ఉన్నత విద్య దిశగా ప్రోత్సహిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. విద్యా రుణాల విధివిధానాలపై విశ్లేషణ... |
No comments:
Post a Comment