Latest Current Affairs

Latest Job Alerts

Career Guidance

Tuesday, 5 November 2013

సీమాంధ్రకు ఐఐటీ, ఐఐఎం!

seemandhra agitation for united AP, IIT, NIT, IIM instittios in seemandhra, HRD likely to announce new IIT or NIT for seemandhra, Home ministry likely to approve IIT, NIT, IIM set up in seemandhra

ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఫలితాలు విడుదల.. 2,606 మంది ఎంపిక

నెల రోజుల్లోగా నియామక పత్రాలు
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. కోర్టు ఆదేశించడంతో ఆ పోస్టుల పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొత్తం 2,606 మంది రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నెలరోజుల్లోగా వారికి నియామక పత్రాలు అందజేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఆయన ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 4,56,983 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 97,706 మంది శరీర దారుఢ్య పరీక్షలు అధిగమించి రాత పరీక్షకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. రాత పరీక్షలో 2,606 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశామన్నారు. ఉద్యోగాలు పొందిన వారిలో 840 మంది మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. 1994 నాటి ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నియామకాల్లో అర్హత సాధించిన వారి కోసం 265 పోస్టులను రిజర్వ్ చేసి ఉంచామని, కోర్టు తుది తీర్పు అనంతరం వారికి నియామకపత్రాలు జారీ చేస్తామని మంత్రి వివరించారు. కానిస్టేబుళ్ల ఫలితాలనుcperesults768712.cgg.gov.in/PROResults01112013.pro వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఫలితాలు విడుదల.. 2,606 మంది ఎంపిక

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner