ఇటీవలి కాలంలో భారత, చైనా దేశాల మధ్య చెలరేగిన సరిహద్దు వివాదం మన దేశంలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఇరుపక్షాల చొరవతో తాత్కాలికంగా ఈ వివాదానికి తెరపడింది. కానీ భవిష్యత్‌లో మరిన్ని ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదముంది. యూరప్‌లో ఫ్రాన్‌స, బ్రిటన్, జర్మనీల మధ్య వంద సంవత్సరాలు యుద్ధాలు జరిగాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఈ మూడు దేశాలు మిత్రదేశాలయ్యాయి. మరి ఇండియా, చైనా దేశాలు అలాంటి శాంతియుత వాతావరణాన్ని సృష్టించుకోలేవా? జనాభా దృష్ట్యా ప్రపంచంలోని అతి పెద్ద దేశాలైన ఈ రెండు ఘర్షణకు దిగితే ప్రపంచంలో మూడోవంతు జనాభా తల్లడిల్లడమే కాకుండా, ప్రపంచ శాంతికే విఘాతం ఏర్పడుతుంది. 21వ శతాబ్దం ఆసియా శతాబ్దం. ఇండియా, చైనాలు అతిశక్తివంతమైన రాజ్యాలుగా పరిణామం చెందుతాయని మేధావులు, ప్రపంచ నాయకులు ఒక వైపు ఉద్ఘాటిస్తుంటే, ఇటీవల అంతర్జాతీయ నదీజలాల (బ్రహ్మపుత్ర) వినియోగం విషయంలో, వాస్తవాధీనరేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించే విషయంలో చైనా వైఖరిలో హేతుబద్ధత లోపించిందనిపిస్తుంది. ఇది ఇరుదేశాలకు నష్టదాయకమే.భారత్ - చైనా సంబంధాలు-విశ్లేషణ

Ethical hacking is an offensive activity or hacking done with due permission from the client. The objective in it is to actively hack to identify security issues. Ethical hacking is a trust building activity. An ethical hacker should not disclose any confidential information to outsiders.