Latest Current Affairs
Latest Job Alerts
Career Guidance
Friday, 27 September 2013
Six Novel Speacilizations in MBA course
ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్.. ఇవి సాధారణంగా అందరికీ తెలిసిన, ఠక్కున గుర్తుకొచ్చే ఎంబీఏ స్పెషలైజేషన్స్. కానీ ప్రస్తుత కార్పొరేట్ యుగంలో.. మారుతున్న బిజినెస్ అవసరాలు, మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో.. అనేక సరికొత్త స్పెషలైజేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఎంబీఏ గ్రాడ్యుయేట్స్.. తమ విద్యానేపథ్యం.. ఆసక్తి.. అవకాశాలు- ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని స్పెషలైజేషన్‌ను ఎంచుకుంటే.. కెరీర్ మరింత కళకళలాడటం ఖాయం. మేనేజ్‌మెంట్ కోర్సుల ఔత్సాహికుల అద్భుత కెరీర్‌కు సోపానంగా నిలుస్తున్న ఆరు వినూత్న స్పెషలైజేషన్స్ వివరాలు మీ కోసం!! |
కలల కొలువులకు కేరాఫ్.. ఏవియేషన్
హై రెమ్యునరేషన్‌కు చిరునామా ఏవియేషన్. పెరుగుతోన్న ఎయిర్ ట్రాఫిక్, సరికొత్త విమానాలు, అధునాతన ఎయిర్‌పోర్టులు దీనికి సాక్షి. గంటకో దేశం, పూటకో ప్రాంతంలో గడపాల్సిన పరిస్థితి సీఈఓలకే కాదు మిడిల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్‌లకూ అనివార్యమైంది. అందుకే ఏవియేషన్ విస్తృతి మరింత పెరిగింది. ఏవియేషన్ అంటే పైలట్ ఒక్కటే కాదు. ఇందులో ఎన్నో ఉద్యోగాలున్నాయి. గ్రౌండ్ డ్యూటీ ఉద్యోగాలు, కేబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ (ఏటీసీ)... ఇలా రకరకాల కెరీర్ ఆప్షన్లు ఏవియేషన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏవియేషన్ కెరీర్‌పై ఫోకస్.. |
Subscribe to:
Comments (Atom)
