యూపీఏ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దేశంలోని మూడింట రెండొంతుల జనాభాకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను సరఫరా చేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన బిల్లును గత వారం లోక్‌సభ ఆమోదించగా, సెప్టెంబరు 2న రాజ్యసభ ఆమోదించింది. దాదాపు 82 కోట్ల జనాభాకు లబ్ధి చేకూర్చే ఆహార భద్రత బిల్లు చట్టంగా మారేందుకు ఇక రాష్ట్రపతి ఆమోదం మాత్రమే పొందాల్సి ఉంది. Selfsufficiancy in agriculture leads to Foof security